sree reddy: తమిళంలో శ్రీరెడ్డి బయోపిక్.. వివరాల వెల్లడి!

  • సినిమా వివరాలు వెల్లడించిన శ్రీరెడ్డి
  • చిత్రం పేరును ‘రెడ్డి డైరీ’గా నిర్ణయించినట్లు వెల్లడి
  • మోసం చేసినవారి వీడియోలను సినిమాలో పెడతానని వ్యాఖ్య
క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో నటి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ వివరాలను తమిళనాడు రాజధాని చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీరెడ్డి వెల్లడించింది. ఈ సినిమా పేరును ‘రెడ్డి డైరీ’గా పెట్టినట్లు తెలిపింది. ఈ సినిమాకు అల్లావుద్దీన్ దర్శకత్వం వహిస్తారని వెల్లడించింది.

తనను మోసగించినవారికి సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని శ్రీరెడ్డి చెప్పింది. సరైన సమయం వచ్చినప్పుడు అన్నింటిని బయటపెడతానని హెచ్చరించింది. తాను నటించనున్న ‘రెడ్డి డైరీ’ సినిమాకు సహకరిస్తామని నడిగర్ సంగం హామీ ఇచ్చిందని శ్రీరెడ్డి తెలిపింది. తనను మోసం చేసిన వ్యక్తులకు సంబంధించి తనవద్ద ఉన్న వీడియోలను ఈ సినిమాలో చూపెడతానని ఆమె చెప్పింది.
sree reddy
biopic
tamil
Casting Couch

More Telugu News