యూపీలో దారుణం... ఫ్రిజ్ లో భార్య, సూట్ కేసు, బీరువాలో కుమార్తెల శవాలు... సీలింగుకి వేలాడుతూ భర్త!
- తీవ్ర కలకలం రేపిన ఐదు మృతదేహాలు
- సోమవారం రాత్రి స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి
- కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులు
హత్య చేసిన తరువాత బలవంతంగా ఫ్రిజ్, బీరువా, సూట్ కేసుల్లో మృతదేహాలను కుక్కి ఉంచారు. తన భార్య, కుమార్తెలను హత్య చేసిన ఆ వ్యక్తి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న కోణంలో విచారిస్తున్నామని, ఇంటి బయట తాళం వేసి ఉండటంతో కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని అలహాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నితిన్ తివారీ వెల్లడించారు.