బాలికపై అత్యాచారం చేస్తుంటే.. నిందితులను కరిచి కరిచి అడ్డుకున్న శునకరాజం!
- మధ్యప్రదేశ్ లో ఘటన
- అత్యాచారం చేస్తుంటే పెంపుడు కుక్కను పిలిచిన బాధితురాలు
- వారిపై దాడి చేసి పారిపోయేలా చేసిన శునకం
అక్కడ ఆమెపై అఘాయిత్యానికి యత్నించారు. ఆ సమయంలో బాలిక, తన పెంపుడు కుక్కను పిలిచింది. దీంతో ఆగమేఘాల మీద వచ్చిన ఆ కుక్క వారిపై దాడి చేసింది. దీంతో వారిద్దరూ బతుకుజీవుడా అని పారిపోక తప్పలేదు. తన యజమానికి ఆపద కలిగిందన్న భావనలో, ఆ శునకం పదే పదే అరుస్తూ, స్థానికులను సైతం అప్రమత్తం చేసింది. కుక్క మొరుగుతూ ఉండటాన్ని చూసిన ఇరుగు పొరుగు వారు, అక్కడికి వచ్చి, బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి, వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.