Kochi airport: వరదల ఎఫెక్ట్: కొచ్చి విమానాశ్రయానికి 500 కోట్ల నష్టం

  • కొచ్చి ఎయిర్ పోర్టుకి విమానాల రాకపోకలు రద్దు  
  • ఆగస్ట్ 26 వరకు రాకపోకలు బంద్  
  • టెర్మినల్ ను శుభ్రం చేసే పనిలో 200 మంది  సిబ్బంది
దాదాపు 20 వేల కోట్ల నష్టంతో కేరళ ప్రజలకు తీరని కష్టాన్ని మిగిల్చిన వరదల ప్రభావం నుండి కేరళ అప్పుడే బయటపడేలా లేదు. ఆ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు కొచ్చి విమానాశ్రయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లింది. విమానాశ్రయానికి విమానాల రాకపోకలను రద్దు చేయడం వల్ల సుమారు రూ.500 కోట్ల మేరకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

 ఆగస్ట్ 26 వరకు విమానాశ్రయం నుండి ఎటువంటి రాకపోకలు జరిగే అవకాశం లేదు. విమానాశ్రయంలో వరద వల్ల పేరుకుపోయిన చెత్తను, టెర్మినల్ బిల్డింగ్ ను శుభ్రం చేసేందుకు 200 మంది సిబ్బంది పని చేస్తున్నారు. అయితే, అప్పటి వరకు సమీపంలో వున్న ఓ నౌకాదళ ఎయిర్ స్టేషన్ నుండి పౌర విమానాలను నడపనున్నారు.

Kochi airport
Kerala

More Telugu News