kerala: కేరళ వరదలను తీవ్రమైన ప్రకృతి విపత్తుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం

షార్ట్స్‌లో చూడండి
భారీ వరదలతో కేరళ అతలాకుతలమయింది. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో, కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో, కేరళ వరద బీభత్సాన్ని తీవ్రమైన ప్రకృతి పపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ప్రకటన నేపథ్యంలో కేరళకు ఆర్థిక సాయంతో పాటు సహాయ, పునరావాస కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి, కేంద్రం పనిచేయనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. 
Go Back to Shorts
kerala

More Telugu News