katragadda prasuna: బీజీపీకి రాజీనామా చేసిన కాట్రగడ్డ ప్రసూన.. టీడీపీలో చేరిక?

  • బీజేపీకి గుడ్ బై చెప్పిన సెటిలర్స్ ఫోరం అధ్యక్షురాలు ప్రసూన
  • టీడీపీలో చేరనున్నారంటూ ప్రచారం
  • ఏపీలో కూడా బీజేపీ నుంచి టీడీపీలోకి పెరుగుతున్న వలసలు
తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని భావిస్తున్న బీజేపీకి... ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు గుడ్ బై చెబుతుండటం ఆందోళనను కలిగిస్తోంది. తాజాగా హైదరాబాదుకు చెందిన కాట్రగడ్డ ప్రసూన బీజేపీకి రాజీనామా చేశారు. సెటిలర్స్ ఫోరం అధ్యక్షురాలిగా ప్రసూన వ్యవహరిస్తున్నారు. ఆమె టీడీపీలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించి ఆమె నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఏపీలో కూడా బీజేపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. పశ్చిమగోదావరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు తన కుమారుడితో పాటు టీడీపీలో చేరిపోయారు. బాపట్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఆవుల వెంకటేశ్వర్లు కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.
katragadda prasuna
bjp
Telugudesam

More Telugu News