vijay devarakonda: 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'గీత గోవిందం'

షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య కాలంలో యూత్ ను విపరీతంగా .. విశేషంగా ఆకట్టుకున్న చిత్రంగా 'గీత గోవిందం' కనిపిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజునే 16.40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, ఈ ఏడాదిలో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తన జోరు చూపిస్తోంది. తొలి 5 రోజుల్లో ఈ సినిమా 55 కోట్ల గ్రాస్ ను .. 31కోట్ల షేర్ ను సాధించింది.  చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం పట్ల అంతా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫుల్ రన్ లో ఈ సినిమా అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. యూత్ కి కావలసిన అంశాలు పుష్కలంగా ఉండటం వల్లనే థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
vijay devarakonda
rashmika

More Telugu News