bellamkonda srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ తో జోడీ కట్టేసిన మెహ్రీన్

  • హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ 
  • కథానాయికలుగా కాజల్.. మెహ్రీన్ 
  • హైదరాబాద్ లో జరుగుతోన్న షూటింగ్
ఇప్పుడున్న గ్లామరస్ కథానాయికలలో మెహ్రీన్ ముందువరుసలో కనిపిస్తుంది. మెహ్రీన్ ఖాతాలో సక్సెస్ ల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన .. యూత్ లో ఆమెకి గల క్రేజ్ కారణంగా వరుస అవకాశాలు వరిస్తూనే వున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఒక సినిమా .. వరుణ్ తేజ్ తో ఒక మూవీ చేస్తోన్న ఆమె, బెల్లంకొండ శ్రీనివాస్ తో జోడీ కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగులో ఆమె జాయిన్ అయింది.

 'సాక్ష్యం' సినిమా తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో మొదలుపెట్టాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఆల్రెడీ కాజల్ ను తీసుకున్నారు. తాజాగా మెహ్రీన్ ను తీసుకోవడం .. ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కావడం జరిగిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. చంద్రబోస్ సాహిత్యం .. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని అంటున్నారు.   
bellamkonda srinivas
mehreen

More Telugu News