Hyderabad: హైదరాబాద్ లో రాత్రి నుంచి వర్షం... పలు కాలనీల్లోకి చేరుతున్న నీరు!

  • నిన్నటి నుంచి ఆగని వర్షం
  • రోడ్లపైకి చేరిన వర్షపు నీరు
  • సహాయక చర్యలు ప్రారంభించిన జీహెచ్ఎంసీ
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఆపై రాత్రి నుంచి అడపాదడపా కురుస్తున్న జల్లులతో పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పల్లపు ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లోకి నీరు వస్తుండటంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది.

నగర పరిధిలోని రామాంతపూర్, ఉప్పల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అమీర్ పేట, పంజాగుట్ట నిమ్స్, నాగార్జున సర్కిల్, బోయగూడ, చింతల్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై చేరగా, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. హబ్సీగూడలో పలు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మియాపూర్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ లోకి కూడా వరద నీరు ప్రవేశించింది. వరద నీరు నిలిచిన చోట సహాయక చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు.
Hyderabad
Rain
Flood
Water
GHMC

More Telugu News