Kerala: 'నేనూ వరద బాధితురాలినే' అంటూ... తన ఇంటి ఫొటోలు పోస్టు చేసిన హీరోయిన్ అనన్య!

  • అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన వరదలు
  • నీటిలో చిక్కుకున్న ఎంతో మంది సెలబ్రిటీల ఇళ్లు
  • తన స్నేహితురాలి ఇంట్లో తలదాచుకున్నామన్న అనన్య
కేరళను ముంచెత్తిన వరదలు పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేసి, నానా ఇబ్బందులూ పెట్టాయి. ఎంతో మంది సెలబ్రిటీల ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నటుడు జయరామ్, సలీమ్ కుమార్ తదితరుల ఇళ్లను నీరు ముంచెత్తింది.

తాజాగా, తాను పడ్డ కష్టాన్ని సామాజిక మాధ్యమాల్లో వివరించింది హీరోయిన్ అనన్య. 'ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్', 'సీడన్‌' తదితర తమిళ చిత్రాల్లో నటించిన ఈ మలయాళ నటి ఇల్లంతా వరదతో నిండిపోయిందట. ఇంట్లోని వారమంతా ఎంతో భయపడ్డామని, ఎలాగోలా బయటపడి ప్రస్తుతం తన స్నేహితురాలి ఇంట్లో తల దాచుకున్నామని వాపోయింది. తన ఇల్లున్న ప్రాంతంలో ఎంతో మంది చిక్కుకుని ఉన్నారని, వారిని రక్షించాలని కోరింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్న వారికి సాయపడాలని విజ్ఞప్తి చేసింది.
Kerala
Ananya
Floods

More Telugu News