Uttam Kumar Reddy: త్వరలో తెలంగాణ శాసనసభ రద్దు కాబోతోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయి
  • టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది
  • కాంగ్రెస్ గెలవడం ఖాయం
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభ రద్దు కాబోతోందని ఆయన చెప్పారు. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. త్వరలోనే ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని... కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు.
Uttam Kumar Reddy
telangana
elections

More Telugu News