Atal Bihari Vajpayee: హరిద్వార్ లో వాజపేయి చితాభస్మ నిమజ్జనం.. పాల్గొన్న అమిత్ షా, యోగి

షార్ట్స్‌లో చూడండి
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చితాభస్మాన్ని హరిద్వార్‌లోని ప్రఖ్యాత హరి-కి-పౌరి ఘాట్ వద్ద గంగానదిలోవాజ్‌పేయి దత్తపుత్రిక నమిత చేతుల మీదుగా నిమజ్జనం చేశారు. ఉదయం న్యూఢిల్లీలోని స్మృతి స్థల్ నుంచి వాజ్‌పేయి చితాభస్మాన్ని నమిత, ఆమె కుమార్తె నిహారిక సేకరించి డెహ్రాడూన్ తీసుకువచ్చారు. అక్కడ నుండి 'అస్థి కలశ యాత్ర' మొదలైంది.

ముందుగా ప్రేమ్ ఆశ్రమానికి చేరుకున్న యాత్ర, అక్కడ్నించి హర్-కి-పౌరి ఘాట్‌కు చేరుకుంది. అనంతరం వాజ్‌పేయి చితాభస్మాన్ని నమిత గంగానదిలో కలిపారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కూడా నమితతో పాటు చితాభస్మ నిమజ్జనంలో పాల్గొన్నారు.
Go Back to Shorts
Atal Bihari Vajpayee

More Telugu News