గుడిలో ఏకంగా లింగాన్నే మాయం చేశారు!
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఘటన
- కేతిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఆలయంలో శివలింగం మాయం
- కేసు నమోదు చేసిన పోలీసులు
తాజాగా ఆలయానికి వెళ్లిన భక్తులకు గుడిలోని శివలింగం కనిపించలేదు. వార్త తెలిసిన వెంటనే గుంపులు గుంపులుగా గ్రామస్తులు ఆలయానికి చేరుకున్నారు. ఈ లింగాన్ని నిన్న రాత్రి తీసుకెళ్లారా? లేక రెండుమూడు రోజుల క్రితమే తీసుకెళ్లారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఆలయ సంరక్షణ కోసం పురావస్తు శాఖ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.