Atal Bihari Vajpayee: మా కుక్క కరిచినా వాజ్ పేయికి కోపం రాలేదు: శర్మిష్ఠ ముఖర్జీ

  • వాజపేయిని తమ పెంపుడు కుక్క కరిచినా నవ్వుతూనే వున్నారని శర్మిష్ఠ ట్వీట్
  • పక్క పక్కనే ఇళ్లు ఉన్నప్పుడు బాగా కలిసిమెలిసి వుండేవాళ్ళం అన్న శర్మిష్ఠ 
  • ఆయనతో మా కుటుంబానికి ఉన్న అనుబంధం తీపి జ్ఞాపకం
మాజీ ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణించినప్పటికీ ఆయన ఎందరి జీవితాలలోనో తీపి జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళారు. సామాన్యుల నుండి రాజకీయ ప్రముఖుల వరకు ఆయనతో ఉన్న తమ అనుబంధాన్ని, నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ వాజ్ పేయితో తమ కుటుంబానికి వున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.

'వాజ్‌ పేయీజీ ఇల్లు, మా ఇల్లు పక్కపక్కనే ఉండేవి. ఓసారి వాజ్‌ పేయీజీ ఉదయం వాకింగ్‌కి వెళుతుంటే మా ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క డాకూ ఆయన్ను కరిచింది. అయినా ఆయన కోపంతో కాకుండా నవ్వుతూనే కనిపించారు. డాకూ అరుపులు విని మా అమ్మ గబగబా బయటకి వెళ్లి చూస్తే వాజ్‌ పేయీజీ తమ ఇంట్లో పెంచిన ఆకుకూరలను అమ్మకు ఇచ్చి వెళ్ళారు. మా ఇల్లు, వాజపేయిజీ ఇల్లు పక్క పక్కనే ఉన్న సమయంలో మా మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు ఒక తీపి జ్ఞాపకంగా ఉండేవి' అంటూ శర్మిష్ఠ తన ట్విట్టర్ లో వాజ్‌ పేయితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 
Atal Bihari Vajpayee

More Telugu News