disha poovaiah: హీరోయిన్ దిశా కుటుంబాన్ని ఆదుకోండి: కర్ణాటక సీఎం ఆదేశం

షార్ట్స్‌లో చూడండి
భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని కొడగు జిల్లా అతలాకుతలమయింది. ఇళ్లపైకి చేరుకున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ముక్కోడులో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కన్నడ హీరోయిన్ దిశా పూవయ్య ముఖ్యమంత్రి కుమారస్వామిని కోరారు.

అక్కడ కొండ చరియలు విరిగి పడటంతో వారు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె విన్నపంపై కుమారస్వామి స్పందించారు. వెంటనే ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. దిశా కుటుంబీకులు సుమారు 70 మంది అక్కడ నివసిస్తున్నారు. వారిలో ఇద్దరు నిండు గర్భిణీలు కూడా ఉన్నారు.
Go Back to Shorts
disha poovaiah
family
floods
kumaraswamy

More Telugu News