sunita: యువకుడితో ప్రేమ, సహజీవనం... అతనికి అప్పటికే పెళ్లయిందని తెలియడంతో ఆత్మహత్య!

  • పెళ్లి విషయాన్ని దాచి యువకుడి సహజీవనం
  • విషయం తెలుసుకుని నిలదీసిన యువతి
  • మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సునీత
తాను ప్రేమించి సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఇంతకుముందే పెళ్లయిందని తెలియడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. చివరికి చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ లోని కుషాయిగూడ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సునీత(21) అనే యువతి నర్సుగా పనిచేస్తోంది. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న మనోహర్, సునీతల మధ్య పరిచయం ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ ఏఎస్ రావు నగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. కాగా వారం రోజుల క్రితం మనోహర్ కు పెళ్లయిన విషయం సునీతకు తెలిసింది.

దీంతో ఈ విషయమై మనోహర్ ను ఆమె నిలదీసింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని మరుసటి రోజు మనోహర్ కు ఫోన్ లో చెప్పిన సునీత తాడుతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంటికి హుటాహుటిన చేరుకున్న మనోహర్ ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మనోహర్ ను అదుపులోకి తీసుకున్నారు.
sunita
marriage
Hyderabad
kusahiguda
Police
hospital
suicide
private
livein relationship

More Telugu News