dawood: మాఫియా డాన్ దావూద్ కు షాక్.. జబిర్ మోతీని అరెస్ట్ చేసిన బ్రిటన్!

  • అరెస్ట్ చేయాలని గతంలో పలుమార్లు కోరిన భారత్
  • డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాలో కీలకమని వెల్లడి
  • అరెస్ట్ చేసినట్లు ధ్రువీకరించిన బ్రిటన్ అధికారులు
పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు బ్రిటన్ పోలీసులు షాకిచ్చారు. అరబ్, యూరప్ లో దావూద్ బిజినెస్ ను చూసుకుంటున్న జబిర్ మోతీని అరెస్ట్ చేశారు. డీ-గ్యాంగ్ లో కీలకంగా వ్యవహరిస్తున్న జబిర్ ను ఇక్కడి హిల్టన్ హోటల్ లో అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ ధ్రువీకరించింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మోతీని అరెస్ట్ చేయాలని గతంలో బ్రిటన్ ను భారత్ చాలాసార్లు కోరింది. ఇండియాలోకి మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ ఆయుధాల అమ్మకంతో పాటు బలవంతపు వసూళ్లు, సెటిల్మెంట్లలో మోతీ ప్రమేయం ఉందని భారత ప్రభుత్వ వర్గాలు బ్రిటన్ కు వివరించాయి. దీంతో పదేళ్ల వీసా గడువు ఉన్నప్పటికీ అక్కడి అధికారులు మోతీని కటకటాల వెనక్కి నెట్టారు. పాక్ పౌరుడైన మోతీ డాన్ దావూద్, ఆయన భార్య మహజబీన్ కు అత్యంత సన్నిహితుడని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
dawood
jabir moti
arrest
british police
India

More Telugu News