West Bengal: అచ్చం సినిమా కథే... పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన విద్యార్థుల లవ్ మేరేజ్... ఒంగోలు వద్ద పది రోజుల కాపురం!

  • రెండేళ్లుగా ప్రేమలో 15 ఏళ్ల బాలుడు, బాలిక
  • పెళ్లికి ఒప్పుకోరని, ఇంట్లో దొంగతనం చేసి ఒంగోలుకు
  • గుడిలో పెళ్లి చేసుకుని కాపురం
  • కౌన్సెలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు
ఇది అచ్చం సినిమా కథను తలపించే వాస్తవం. పశ్చిమ బెంగాల్ నుంచి పారిపోయిన ఇద్దరు పాఠశాల విద్యార్థులు ఒంగోలు వచ్చారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు, ఒంగోలుకు వచ్చి గుడిలో పెళ్లి చేసుకోవడంతో పాటు, సముద్రతీరంలో ఓ పాకలో పది రోజులుగా కలసి ఉంటున్నారు. వీరిని చూసిన స్థానికులు వివరాలు అడిగి, ఇంటికి వెళ్లాలని చెప్పి, కోల్ కతా వెళ్లే రైలు ఎక్కించగా, వారిని అనుమానించిన విజయవాడ చైల్డ్ లైన్ అధికారులు, అదుపులోకి తీసుకుని చైల్త్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచారు.

సినిమాల ప్రభావంతో తాము రెండేళ్లుగా ప్రేమలో ఉన్నామని, తమ పెళ్లికి పెద్దలు అంగీకరించబోరన్న భయంతో, కొంత డబ్బు తీసుకుని పారిపోయి వచ్చామని వారు చెప్పారు. వారికి కౌన్సెలింగ్ నిర్వహించిన చైల్డ్ లైన్ సిబ్బంది, తల్లిదండ్రులకు సమాచారాన్ని ఇచ్చారు.
West Bengal
Ongole
Lovers
Minors
Chaildline
Temple
Marriage

More Telugu News