Kerala: అతలాకుతలమైన దేవభూమికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు విరాళం

  • ప్రకృతి అందాలకు నిలయమైన భూమిపై జలవిలయం
  • రూ. 25 లక్షల సాయం ప్రకటించిన మహేష్ బాబు
  • సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నట్టు ప్రకటన
నిన్నటి వరకూ పర్యాటకులకు స్వర్గధామంలా, ప్రకృతి అందాలకు నిలయంలా, దేవభూమిలా నిలిచి, నేడు ఎన్నడూ ఎరుగనంత భారీ వర్షాల కారణంగా అత్యంత దుర్భర స్థితిలోకి జారిపోయిన కేరళను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముందుకు వచ్చాడు. తన వంతు సాయంగా రూ. 25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించాడు. వరదల నుంచి కేరళ వాసులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. కాగా, ఇప్పటికే పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కేరళకు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Kerala
Floods
Mahesh Babu
CM Relief Fund

More Telugu News