Rain: వచ్చే 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షం!

షార్ట్స్‌లో చూడండి
రానున్న 48 గంటల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతంలోని అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. ఏపీలోని కోస్తాంధ్రలోనూ వర్షాలు కురుస్తాయని, ఈశాన్య భారతావనితో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ వర్షాలకు అవకాశముందని వెల్లడించారు.
Go Back to Shorts
Rain
IMD
Telangana
Andhra Pradesh

More Telugu News