america: రేపటి అమెరికా పర్యటన రద్దు చేసుకున్న కేరళ సీఎం

  • వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లాల్సి ఉన్న పినరయి
  • కేరళలో ప్రస్తుత పరిస్థితుల రీత్యా పర్యటన వాయిదా
  • ధ్రువీకరించిన కేరళ సచివాలయ అధికారి  
కేరళ సీఎం పినరయి విజయన్ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం రేపు ఆయన అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ, కేరళలో వర్షాలు, వరదలతో ప్రస్తుత పరిస్థితి దయనీయంగా ఉండటంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. వైద్య చికిత్స నిమిత్తం విజయన్ తన సతీమణితో కలిసి రేపు అమెరికా వెళ్లాల్సి ఉంది కానీ, కేరళలో సహాయక చర్యలను సమీక్షించే నిమిత్తం ఆ పర్యటన వాయిదా పడిందని కేరళ సచివాలయ అధికారి ధ్రువీకరించారు.
america
Kerala
cm

More Telugu News