Chiranjeevi: కేరళ బాధితులకు విరాళాలు ప్రకటించిన ‘మెగా’ ఫ్యామిలీ

  • చిరంజీవి, రామ్ చరణ్ చెరో రూ.25 లక్షలు
  • తల్లి అంజనాదేవీ లక్ష రూపాయలు
  • ఆన్ లైన్ ద్వారా కేరళ సీఎం సహాయనిధికి 
కేరళ వరద బాధితుల సహాయం నిమిత్తం మెగాస్టార్ చిరంజీవి సహా ఆయన కుటుంబసభ్యులు విరాళాలు ప్రకటించారు. చిరంజీవి రూ.25 లక్షలు, ఆయన తల్లి అంజనాదేవీ లక్ష రూపాయలు, చిరు తనయుడు రామ్ చరణ్ రూ.25 లక్షలను ఆన్ లైన్ ద్వారా కేరళ సీఎం సహాయనిధికి పంపారు. రామ్ చరణ్ భార్య ఉపాసన రూ.10 లక్షల విలువ చేసే మందులు, ఆహారపదార్థాలు.. కేరళకు పంపారు. కాగా, హీరోలు అల్లు అర్జున్ .25 లక్షలు, విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు విరాళాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. 
Chiranjeevi
Kerala

More Telugu News