vajpayee: వాజ్ పేయి కుమార్తెను పరామర్శించిన ఏపీ కాంగ్రెస్ నేతలు!
భారత మాజీ ప్రధాని వాజ్ పేయి కుమార్తెను ఏపీసీసీ అధ్యక్షుడు డా.రఘువీరా రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పరామర్శించారు. న్యూ ఢిల్లీలోని వాజ్ పేయి అధికార నివాసానికి ఈరోజు వారు వెళ్లారు. వాజ్ పేయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన అనంతరం తమ సంతాప సందేశాన్ని రాశారు. ఈ మేరకు ఏపీసీసీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


