kanti velugu: ‘కంటి వెలుగు’ శస్త్రచికిత్స వికటించి వృద్ధురాలి మృతి!

  • మహబూబ్ నగర్ జిల్లాలో సంఘటన
  • నాట్కో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స
  • ఆపరేషన్ వికటించి చెన్నమ్మ (60) మృతి
మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ‘కంటి వెలుగు’ పథకం కింద చేయించుకున్న ఆపరేషన్ వికటించడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. కేశంపేట మండలంలోని దత్తాయిపల్లికి చెందిన చెన్నమ్మ (60)కు కొత్తూరులోని నాట్కో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేశారు.

ఈ శస్త్ర చికిత్స వికటించడంతో ఆమె మృతి చెందింది. కాగా, మోతాదుకు మించి మత్తు మందు ఇవ్వడం వల్లే చెన్నమ్మ మృతి చెందినట్టు ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, చెన్నమ్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాల్పి ఉంది.
kanti velugu
Ranga Reddy District

More Telugu News