vajpayee: బలవంతంగా పెళ్లి చేస్తారన్న ఉద్దేశంతో.. మూడు రోజులు స్నేహితుడి ఇంట్లో దాక్కున్న వాజ్ పేయి!

  • రూమ్ కు తాళం వేయాలని కోరిన అటల్
  • ఆహారం కోసం తానే తలుపు తడతానని చెప్పిన వైనం 
  • మూడు రోజులు బయటకు రాని వాజ్ పేయి
దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయికి ఆయన తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నారా? దాన్ని తప్పించుకునేందుకు స్నేహితుడి ఇంటిలో దాక్కున్న వాజ్ పేయి మూడు రోజుల వరకూ బయటకు రాలేదా? అంటే వాజ్ పేయి స్నేహితుడు గోరేలాల్ త్రిపాఠి కుమారుడు విజయ్ ప్రకాశ్ అవుననే చెబుతున్నారు.

‘1940ల్లో కాన్పూర్ లోని డీఏవీ కాలేజీలో చదువుతున్నప్పుడు వాజ్ పేయికి ఆయన తల్లిదండ్రులు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి సంబంధాలు చూడటంతో బలవంతంగా పెళ్లి చేస్తారని అనుకున్న వాజ్ పేయి మా ఇంటికి వచ్చేశారు. ఎక్కడికి వెళుతున్నది ఆయన ఇంట్లో చెప్పలేదు. మా ఇంట్లోని ఓ గదిలో 3 రోజులు ఉండిపోయారు. అస్సలు బయటకు రాలేదు. మా నాన్న, వాజ్ పేయి ఆరెస్సెస్ శాఖలో ఒకరికొకరు పరిచయమయ్యారు’ అని విజయ్ చెప్పారు.

ఇక్కడ దాక్కున్నట్లు ఎవ్వరికీ అనుమానం రాకుండా తన రూమ్ కు తాళం వేయాలని తన తండ్రిని వాజ్ పేయి కోరారని ప్రకాశ్ అన్నారు. ఆహారం, నీళ్లు ఏమైనా అవసరమైతే తానే లోపలి నుంచి తలుపు తడతానని వాజ్ పేయి అప్పట్లో చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ తన తండ్రి త్రిపాఠి తనకు చెప్పారని విజయ్ ప్రకాశ్ మీడియాకు తెలిపారు.
vajpayee
marrigae
friends home

More Telugu News