nuthan nayudu: 'బిగ్ బాస్ 2' హౌస్ లో టాస్క్ .. గాయంతో కుప్పకూలిన నూతన్ నాయుడు

  • 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ 
  • 'రోల్ రైడా' పిరమిడ్ పైకి బాల్ విసిరిన నూతన్ 
  • ఆ సమయంలోనే భుజానికి గాయం       
'బిగ్ బాస్ 2' ఇప్పటికే 69 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. దాంతో అందరికీ టాస్క్ ల రూపంలో గట్టి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే గమ్యానికి చాలా దగ్గరగా వచ్చేయడంతో, టైటిల్ ను దక్కించుకోవడానికి ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తున్నారు. అందుకోసం ఎంతటి రిస్క్ చేయడానికైనా కూడా వాళ్లు వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవలే హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు, నిన్న జరిగిన 'పడగొట్టు నిలబెట్టు' టాస్క్ లో పాల్గొని గాయపడ్డాడు.

టాస్క్ లో భాగంగా ఆయన, బ్లాక్స్ తో రోల్ రైడా నిలబెడుతోన్న పిరమిడ్ ను  స్మైలీ బాల్స్ విసురుతూ పడగొట్టడానికి ప్రయత్నించాడు. అలా బాల్స్ వేగంగా విసురుతూ .. భుజం పట్టుకుని ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయాడు. భుజం లోపల బలమైన గాయం కావడం వలన, ఆయనను హాస్పిటల్ కి తరలించారు. గతంలో తనకి భుజానికి సంబంధించిన సమస్య ఉందని ఆ సమయంలో ఆయన చెప్పాడు. నూతన్ నాయుడు లగేజ్ ను సర్దేసి స్టోర్ రూమ్ లో ఉంచారు. మళ్లీ ఆయన ఎంట్రీ ఉంటుందా .. లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.     
nuthan nayudu

More Telugu News