India: బుద్ధి మార్చుకోని పాక్.. వాజ్‌పేయికి నివాళి అర్పించేందుకు వచ్చి కశ్మీర్‌పై వ్యాఖ్యలు!

  • వాజ్‌పేయికి నివాళులు అర్పించిన పాక్ మంత్రి జాఫర్
  • సుష్మా స్వరాజ్‌తో భేటీ
  • చర్చలే కశ్మీర్ సమస్యకు పరిష్కారమని వ్యాఖ్య
తనది వంకర బుద్ధేనని పాకిస్థాన్ మరోమారు నిరూపించింది. వాజ్‌‌పేయికి నివాళులు అర్పించేందుకు వచ్చిన పాకిస్థాన్ మంత్రి సయ్యద్ అలీ జాఫర్ ఆ  పని మానేసి కశ్మీర్ పల్లవి అందుకున్నారు. వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు వచ్చిన అలీ మాట్లాడుతూ.. ఆయన రాసిన కవితలను గుర్తు చేస్తూ.. ఆయనో గొప్ప నేత అని కీర్తించారు. వాజ్‌పేయి దూరదృష్టి ఉన్న నేత అని కొనియాడారు. ఉపఖండం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని ఆయన కలలు కన్నారని పేర్కొన్నారు.

భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాలన్నీ పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పిన ఆయన చర్చల ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ అనంతరం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నివాళులు అర్పించేందుకు వచ్చి ఈ మాటలేంటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పాక్ ఎక్కడున్నా తన బుద్ధిని బయటపెట్టకుండా ఉండదని దుమ్మెత్తి పోస్తున్నారు.
India
Pakistan
Vajpayee
Jammu And Kashmir

More Telugu News