Kerala: కేరళ నిరాశ్రయుల పునరావాసానికి సాయం అందించండి: సీఎం పినరయి విజయన్ విజ్ఞప్తి

  • వందేళ్లలో ఎన్నడూ చూడని వరదలు ముంచెత్తాయి
  • కేరళ పునర్నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇవ్వండి
  • పినరయి విజయన్ విజ్ఞప్తి
కేరళ నిరాశ్రయుల పునరావాసానికి సాయం అందించాలని సీఎం పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. వందేళ్లలో ఎన్నడూ చూడని వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయని, కేరళ రాష్ట్ర పునర్నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహం పెరిగిపోవడంతో, 80 డ్యామ్ ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసినట్టు చెప్పారు. వరదల కారణంగా 324 మంది మృతి చెందారని, 2,23,139 మంది నిరాశ్రయులయ్యారని, నిరాశ్రయులకు 1500పైగా శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు.  
Kerala
donations
pinarai

More Telugu News