nagashaurya: 'నర్తనశాల' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు

  • సొంత బ్యానర్లో 'నర్తనశాల'
  • ఈ నెల 24వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల       
నాగశౌర్య కథానాయకుడిగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో 'నర్తనశాల' సినిమా రూపొందింది. నాగశౌర్య సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో కాశ్మీర .. యామినీ భాస్కర్ కథనాయికలుగా నటించారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 24వ తేదీన ఘనంగా జరపడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. వేదిక ఎక్కడ అనే విషయంలో త్వరలోనే స్పష్టతను ఇవ్వనున్నారు.

ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ మరుసటి రోజునే 'శైలజా రెడ్డి అల్లుడు' విడుదల వుంది. మారుతి సినిమా కావడం వలన .. కీలకమైన రోల్ ను రమ్యకృష్ణ చేయడం వలన భారీస్థాయిలో అంచనాలు వున్నాయి. అయినా ఎంతమాత్రం అధైర్య పడకుండగా 'నర్తనశాల' రంగంలోకి దిగుతుండటం విశేషమేనని చెప్పాలి.      
nagashaurya
yamini
kashmira

More Telugu News