Hyderabad: పోర్న్ సైట్లలో తన వ్యక్తిగత వీడియోలు ప్రత్యక్షమవడంతో పోలీసులను ఆశ్రయించిన హైదరాబాదీ!

  • 2015లో భార్యతో వీడియోలు తీసుకున్న హైదరాబాదీ
  • కర్ణాటకకు చెందిన వ్యక్తిని నిందితుడిగా గుర్తించిన సీసీఎస్ పోలీసులు
  • అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు
తన భార్యతో ఉన్న వేళ, అత్యుత్సాహంతో తీసుకున్న సీక్రెట్ వీడియోలు పోర్న్ సైట్లలో కనిపించడంతో, అవాక్కైన ఓ భర్త హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా, ఆ వీడియోలను అప్ లోడ్ చేసిన నిందితుడి ఆటకట్టించారు పోలీసులు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి, 2015లో తన భార్యతో కలసి కొన్ని వీడియోలు రికార్డు చేసి సేవ్ చేసుకున్నాడు. ఆ తరువాత ఆ ఫోన్ ను అతను పోగొట్టుకున్నాడు. ఆ విషయాన్ని అప్పటితో మరచిపోయాడు.

కాగా, ఇటీవల కొన్ని పోర్న్ వెబ్ సైట్లలో అతని వ్యక్తిగత వీడియోలు కనిపించడంతో, పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ జరిపి, కర్ణాటకకు చెందిన నిందితుడిని అరెస్ట్ చేశారు. వెబ్ సైట్లలో వీడియోలను అప్ లోడ్ చేసి, డబ్బు సంపాదించే అలవాటున్న అతన్ని రిమాండ్ కు తరలించారు.
Hyderabad
Secret Videos
Phone
CCS
Police
Porn Sites

More Telugu News