vijay devarakonda: 'గీత గోవిందం'లో నాగబాబు డబ్బింగ్ చెప్పకపోవడానికి కారణం?

  • కొన్ని నెలలుగా గొంతు సమస్య
  • గట్టిగా మాట్లాడలేకపోతోన్న నాగబాబు 
  • టీవీ షోల్లోను ఇబ్బంది పడుతున్నారు    
విజయ్ దేవరకొండ .. రష్మిక మందన జంటగా రూపొందిన 'గీత గోవిందం' .. ఈ నెల 15వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. తొలిరోజునే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబడుతోంది. ఈ సినిమాలో నాగబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. అయితే ఆయన పాత్రకి వేరెవరో డబ్బింగ్ చెప్పడం ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది.

మంచి పర్శనాలిటీ గల నాగబాబుకి అందుకు తగిన గంభీరమైన వాయిస్ వుంది. తన డైలాగ్ డెలివరీతో ఆయన సన్నివేశాలకి బలాన్ని చేకూర్చేవారు. అలాంటి నాగబాబు కొన్ని నెలలుగా గొంతుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. ఆయన గట్టిగా .. స్పష్టంగా మాట్లాడలేకపోవడం, 'జబర్దస్త్' కామెడీ షోను ఫాలో అయ్యేవారికి తెలుసు. అందుకే, ఈ సినిమాలో ఆయన పాత్రకి వేరేవారితో డబ్బింగ్ చెప్పించారట.    
vijay devarakonda
rashmika

More Telugu News