Kerala: వరదల పరిస్థితిని సమీక్షించడానికి ఈ సాయంకాలం కేరళకు వెళుతున్నా: నరేంద్ర మోదీ

  • వాజ్ పేయి అంత్యక్రియలు ముగియగానే కేరళకు
  • రేపు ఏరియల్ సర్వే చేయనున్న మోదీ
  • 10 రోజులుగా కేరళలో భారీ వర్షాలు

భారీ వర్షాలతో అట్టుడుకుతున్న కేరళలో పర్యటించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వరద బీభత్సాన్ని ప్రత్యక్షంగా తిలకించి, సమీక్ష జరిపేందుకు తాను కేరళ వెళ్లనున్నట్టు ప్రధాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. "కేరళలో ఈ స్థాయి వరదలు రావడం అత్యంత దురదృష్టకరం. పరిస్థితిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో ఫోన్ లో మాట్లాడాను. రాష్ట్ర పరిస్థితులు, జరుగుతున్న సహాయక చర్యల గురించి మాట్లాడాను. పరిస్థితిని సమీక్షించేందుకు నేటి సాయంత్రం కేరళకు వెళుతున్నా" అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సాయంత్రం వాజ్ పేయి అంత్యక్రియల అనంతరం కేరళ చేరుకోనున్న మోదీ, రేపు ఏరియల్ సర్వే చేయనున్నారు. కాగా, కేరళలో గత 10 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జలాశయాలూ నిండుకుండల్లా మారాయి. జలాశయాల నుంచి దిగువస్తున్న వరద నీటితో 13 జిల్లాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. కోచి విమానాశ్రయాన్ని శనివారం వరకూ మూసివేశారంటే పరిస్థితి ఎంత భీతావహంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

More Telugu News