Joginayudu: రెండో పెళ్లి చేసుకున్న నటుడు జోగినాయుడు!

  • అన్నవరంలో వివాహం
  • స్వగ్రామానికి చెందిన సౌజన్యతో పెళ్లి
  • యాంకర్ ఝాన్సీతో తొలిపెళ్లి, ఆపై విడాకులు
ప్రముఖ యాంకర్, సినీ కమేడియన్ జోగినాయుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. నిన్న అన్నవరంలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో, తన స్వగ్రామమైన విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన సౌజన్యను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నాడు. తెలుగు సినీ రంగంలో రాణిస్తున్న జోగినాయుడు, గతంలో ప్రముఖ యాంకర్ ఝాన్సీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై వారిద్దరి మధ్యా వచ్చిన మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. మరోసారి పెళ్లి పీటలు ఎక్కిన జోగినాయుడికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
Joginayudu
Anchor
Marriage

More Telugu News