Atal Bihari Vajpayee: సర్వశిక్షా అభియాన్ ప్రవేశపెట్టింది ఆయనే!: కడియం శ్రీహరి

  • రాజకీయ రంగంలో వాజ్ పేయి ఒక స్ఫూర్తి ప్రదాత 
  • సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ప్రధాని 
  • స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గడానికి కృషి చేసిన మహనీయుడు
భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మృతిపట్ల తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అటల్ జీ అన్నారు. బడి ఈడు పిల్లలు పాఠశాలల్లో ఉండాలనే లక్ష్యంతో సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గడానికి కృషి చేసిన ప్రధాన మంత్రిగా ఎప్పటికి నిలిచిపోతారన్నారు. ఈతరం రాజకీయాలకు ఆయనొక స్ఫూర్తి ప్రదాత అన్నారు. మాజీ ప్రధాని దేశం గర్వించే వ్యక్తి వాజ్ పేయి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. 
Atal Bihari Vajpayee

More Telugu News