vajpayee: వాజ్ పేయి మరణంపై స్పందించేందుకు మాటలు రావట్లేదు: ఎల్ కే అద్వానీ

  • వాజ్ పేయి సీనియర్ నాయకుడు మాత్రమే కాదు
  • ప్రచారక్ గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం
  • అరవై నాలుగేళ్లుగా నాకు మంచి మిత్రుడు
మాజీ ప్రధాని వాజ్ పేయి మరణంపై స్పందించేందుకు తనకు మాటలు రావట్లేదని బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ విచారం వ్యక్తం చేశారు. వాజ్ పేయి సీనియర్ నాయకుడు మాత్రమే కాదని, అరవై నాలుగేళ్లుగా తనకు మంచి మిత్రుడని అన్నారు. ఆర్ఎస్ఎస్ లో ప్రచారక్ గా చేరినప్పటి నుంచి వాజ్ పేయితో తనకు అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.

దేశం గొప్పనాయకుడిని కోల్పోయింది


కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ, అటల్ జీ మరణంతో దేశం గొప్పనాయకుడిని కోల్పోయిందని అన్నారు. వాజ్ పేయి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు.
vajpayee
advani

More Telugu News