Andhra Pradesh: ఏపీలో అంతర్జాతీయ ప్రమాణాలతో మీడియా సిటీ!: చంద్రబాబు

  • ఏపీలో సహజసిద్ధమైన ఆకర్షణీయ ప్రాంతాలున్నాయి  
  • హైదరాబాద్ కృత్రిమ నిర్మాణాలకు, స్టూడియోలకే పరిమితం
  • త్వరలో ఫిలిం ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు 
ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగులకు అనుకూలమైన సహజసిద్ధమైన, ఆకర్షణీయ ప్రాంతాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మీడియా సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు, అమరావతిలో తొమ్మిది సిటీల ఏర్పాటు ప్రతిపాదనలను సమీక్షించారు.

 మీడియాసిటీ ప్రతిపాదనలపై తన ఆలోచనలను సైతం ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు చంద్రబాబుకు వివరించారు. స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులను వినియోగించుకుంటే ఏడాదిన్నరలో సినీ పరిశ్రమ రూపుదిద్దుకుంటుందని సురేష్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో కేవలం స్టూడియోలు, నిర్మాణాల వరకే ఉన్నాయని, ఏపీ నేచురల్ బ్యూటీ అన్న సిఎం చంద్రబాబు అర్హత గల సంస్థలను ఆహ్వానించాలని ఆదేశించారు.
Andhra Pradesh

More Telugu News