vajpayee: ‘ఇక లేరు’ అంటూ యడ్యూరప్ప చేసిన ట్వీట్ పై నెటిజన్ల మండిపాటు!

  • ‘ఇకలేరు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’
  • వాజ్ పేయి పై యడ్యూరప్ప ముందస్తు ట్వీట్ 
  • మండిపడ్డ నెటిజన్లు.. ఆ ట్వీట్ ని తొలగించిన యడ్డీ
మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగానే, ‘ఇకలేరు’ అంటూ ట్వీట్ చేసిన త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ పై నెటిజన్లు ఆగ్రహించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరవక ముందే కర్నాటక బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చేసిన ట్వీట్ వాజ్ పేయి అభిమానులతో పాటు నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

‘ఇకలేరు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ కన్నడ భాషలో యడ్యూరప్ప ట్వీట్ చేశారు. వాజ్ పేయికి ఇంకా చికిత్స కొనసాగిస్తుండగానే, ఇలాంటి ముందస్తు ప్రకటన చేయడమేంటంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో, తాను పోస్ట్ చేసిన ఈ ట్వీట్ ను యడ్యూరప్ప తొలగించడం గమనార్హం. 
vajpayee
yedurappa

More Telugu News