పూర్తిస్థాయిలో సిల్క్ స్మిత జీవితచరిత్ర .. రంగంలోకి 'కబాలి' దర్శకుడు
- స్మిత బయోపిక్ గా వచ్చిన 'ది డర్టీ పిక్చర్'
- ప్రతి ప్రాంతంలోనూ కాసుల వర్షం
- పూర్తిస్థాయి వివరాలతో రంగంలోకి 'కబాలి' దర్శకుడు
ఈ సినిమా సూపర్ హిట్ అయింది కానీ .. ఇందులో సిల్క్ స్మిత జీవితాన్ని పలు కోణాల్లో ఆవిష్కరించలేదనే విమర్శలు వినిపించాయి. అందువలన సిల్క్ స్మిత జీవితాన్ని పూర్తిస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పా రంజిత్ రెడీ అవుతున్నాడు. 'కబాలి' .. 'కాలా' సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయన, సిల్క్ స్మిత జీవితాన్ని వెబ్ సిరీస్ గా రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆమె బాల్యం నుంచి చనిపోయేవరకూ గల అంశాలకి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో ఆయన వున్నాడని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ కి ఆయనే దర్శక నిర్మాతగా వ్యవహరించనున్నాడట.