vajpayee: సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న చంద్రబాబు

  • వాజ్ పేయి ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్తున్న చంద్రబాబు
  • తన మనసు ఎంతో బాధపడుతోందని ట్వీట్
  • వాజ్ పేయితో చంద్రబాబుకు మంచి అనుబంధం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రానికి ఢిల్లీ చేరుకోనున్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్యం పూర్తిగా విషమించిన నేపథ్యంలో, ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. వాజ్ పేయితో వ్యక్తిగతంగా చంద్రబాబుకు ఎంతో అనుబంధం ఉంది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. చంద్రబాబుకు వాజ్ పేయి ఎంతో గౌరవం ఇచ్చేవారు. వాజ్ పేయి ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఈ మధ్యాహ్నం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. 'వాజ్ పేయి ఆరోగ్యం విషమించిందన్న వార్తతో నా మనసు ఎంతో బాధపడుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలి' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
vajpayee
Chandrababu
delhi

More Telugu News