kejriwal: కేజ్రీవాల్ నిండు నూరేళ్లు జీవించాలి: మోదీ

  • ఈ రోజు కేజ్రీవాల్ పుట్టినరోజు
  • శుభాకాంక్షలు తెలిపిన మోదీకి ధన్యవాదాలు తెలిపిన కేజ్రీ
  • కేజ్రీకి గ్రీటింగ్స్ చెప్పిన చంద్రబాబు, మమత, ఒమర్ అబ్దుల్లా, సురేష్ ప్రభు తదితరులు
నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'శ్రీ అరవింద్ కేజ్రీవాల్ కు జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయన మంచి ఆరోగ్యంతో జీవించాలి' అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ శుభాకాంక్షలకు కేజ్రీవాల్ 'థ్యాంక్యూ సో మచ్ సర్' అంటూ రిప్లై ఇచ్చారు.

ఈ రోజుతో కేజ్రీవాల్ 50 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, తేజస్వి యాదవ్, సినీ నటులు విశాల్, రితీశ్ దేశ్ ముఖ్ లతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
kejriwal
modi
birthday
Chandrababu
mamata

More Telugu News