చూస్తుండగానే ముంచెత్తిన వరద... క్షణాల్లో కొట్టుకుపోయిన 12 మంది మిత్రబృందం... వీడియో!
- మధ్యప్రదేశ్ లో ఘటన
- పోల్ జలపాతం వద్దకు వెళ్లిన స్నేహితులు
- వరద పోటెత్తి నదిలోకి జారిపోయిన 12 మంది
నీటిని చూసి భయంతో 30 మంది ఓ రాతి పై భాగాన చిక్కుకుపోగా, మరో 12 మంది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నీటిలోనే నిలబడ్డారు. క్షణాల్లో వరద ఉద్ధృతి పెరగడంతో వీరంతా జలపాతంలో పడిపోయారు. రాతిపై చిక్కుకున్న వారిలో 8 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో కాపాడారు. మిగతావారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్లంతైన 12 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి.