Vajpayee: సర్వత్ర టెన్షన్... వాజ్ పేయి ఇంటిముందు బారికేడ్లు... గ్వాలియర్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన వాజ్ పేయి బంధువులు!

  • ప్రత్యేక విమానంలో వస్తున్న బంధువులు
  • ఎయిమ్స్ కు రాహుల్, ఒమర్ అబ్దుల్లా
  • వాజ్ పేయి ఇంటి ముందు బారికేడ్లు
  • రహదారిని బ్లాక్ చేసిన పోలీసులు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యం మరింతగా క్షీణించిందని ఈ ఉదయం న్యూఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ లో వెల్లడించడంతో, గ్వాలియర్ లోని వాజ్ పేయి బంధువులు హుటాహుటిన న్యూఢిల్లీకి బయలుదేరారు. వారిని తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్టు వార్తలు వెలువడటంతో, బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి వద్దకు రాగా, మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ, మరోసారి ఆసుపత్రికి రానున్నారని అధికారులు వెల్లడించారు. ఆసుపత్రి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బంది, ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. మరోవైపు వాజ్ పేయి ఇంటి ముందు కూడా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేసి, రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి, రహదారిని బ్లాక్ చేయడంతో సర్వత్ర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
Vajpayee
Narendra Modi
AIMMS
Rahul Gandhi
Gwaliar

More Telugu News