Vajpayee: వాజ్ పేయి ఆరోగ్యంపై తాజా బులెటిన్!

  • హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఎయిమ్స్
  • లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై మాజీ ప్రధాని
  • పరామర్శించేందుకు అగ్రనేతల క్యూ
గడచిన కొన్ని వారాలుగా న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యంపై కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి మీడియా అండ్ ప్రొటోకాల్ డివిజన్ చైర్ పర్సన్ డాక్టర్ అరిల్ విజు పేరిట హెల్త్ బులెటిన్ విడుదలైంది. "మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యం విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయన్ను లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉంచాం" అని పేర్కొన్నారు. మరోవైపు ఆయన్ను పరామర్శించేందుకు బీజేపీ అగ్రనేతలు ఆసుపత్రి ముందు క్యూ కట్టగా, వాజ్ పేయి అభిమానులు తీవ్ర ఆందోళనతో తమ ప్రియనేత కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. 
Vajpayee
Health Bulletin
New Delhi
AIMMS

More Telugu News