Srikakulam District: శ్రీకాకుళం పోలీసుల ఓవరాక్షన్.. తండ్రిని కొడుతుంటే వేడుకున్న బిడ్డలు!

  • ఆర్ట్స్ కళాశాలలో జెండా పండగ
  • ఓ దారిని మూసేసిన పోలీసులు
  • ఆ దారిలో ఫుట్ పాత్ పై ఉన్నందుకు జులుం
  • తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ప్రజలు
స్వాతంత్ర్య దినోత్సవం నాడు సరదాగా బయటకు వెళ్లి, జెండా వందనం వేడుకలను తిలకించాలని భావించిన ఆ తండ్రీ, బిడ్డలకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కాలేజీలో వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా, అక్కడికి వచ్చే ఓ మార్గాన్ని వీఐపీల కోసం పోలీసులు మూసివేశారు. అయినా అటునుంచి వస్తున్న ప్రజలను అదుపు చేసే క్రమంలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

ఈ సమయంలో తన ఇద్దరు బిడ్డలతో కలసి వచ్చిన ఓ వ్యక్తి, ఎటూ వెళ్లే దారిలేక ఫుట్ పాత్ పై నిలబడ్డారు. అతన్ని చూసిన పోలీసులు ఆగ్రహంతో చుట్టుముట్టి ఇక్కడెందుకున్నావంటూ చితకబాదుతుంటే, ఆ బిడ్డలు వలవలా ఏడ్చారు. "మా నాన్నను కొట్టకండి" అంటూ వేడుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన చుట్టుపక్కల వారు సైతం, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చివరకు తన పిల్లలను ఓదార్చి, వారి ఏడుపు ఆపించిన తండ్రి, వారిని తీసుకుని ఇంటిదారి పట్టాడు.
Srikakulam District
August 15
Independence Day
Police

More Telugu News