డొల్ల మాటలు కట్టిపెట్టి నిజాలు మాట్లాడి ఉంటే బాగుండేది: మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ మండిపాటు
- ఎర్రకోట సాక్షిగా మోదీ అబద్ధాలు
- సామాన్యులకు పనికొచ్చే ఒక్క విషయం కూడా లేదు
- ప్రజలంతా ఇప్పుడు సచ్ఛే దిన్ కోసం ఎదురు చూస్తున్నారు
అవినీతి, మాబ్ లించింగ్ (మూకదాడులు), చైనా చొరబాటుపై చర్చకు రావాలన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సవాలును మోదీ స్వీకరించాలని సవాలు విసిరారు. మోదీ తన ప్రసంగంలో సామాన్యులకు పనికొచ్చే ఒక్క ముక్కా చెప్పలేదన్నారు. ఎర్రకోట సాక్షిగా ఆయన అబద్ధాలను వల్లె వేశారని సూర్జేవాలా విమర్శించారు.