Andhra Pradesh: నూజివీడు ట్రిపుల్ ఐటీలో మతప్రార్థనలు నిజమే.. కమిటీకి చెప్పిన విద్యార్థులు!

  • ప్రతీ ఆదివారం బయటి నుంచి పాస్టర్లు
  • క్యాంపస్‌లో మత ప్రార్థనలు
  • నిగ్గు తేల్చిన కమిటీ
నూజివీడు ట్రిపుల్ ఐటీలో మతప్రార్థనలు జరుగుతున్న విషయం ఇటీవల బయటకొచ్చి సంచలనమైంది. విద్యార్థుల తల్లిదండ్రుల పేరుతో క్యాంపస్‌లోకి చొరబడుతున్న కొందరు మత బోధకులు అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరుగా మతబోధనలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ట్రిపుల్ ఐటీ అధికారుల్లో కొందరు వీరికి సహకారం అందిస్తున్నట్టు వార్తలు రావడంతో కలకలం రేగింది.

మత ప్రార్థనల ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు వైస్ చాన్స్‌లర్ ఓ కమిటీని నియమించారు. కమిటీ విచారణ సందర్భంగా క్యాంపస్‌లో ప్రతీ ఆదివారం మత ప్రార్థనలు జరగడం వాస్తవమేనని తేలింది. విచారణ కమిటీ ఎదుట విద్యార్థులు ఈ విషయాన్ని వెల్లడించారు. బయటి నుంచి పాస్టర్లు వచ్చి క్యాంపస్‌లో ఆదివారం మత ప్రార్థనలు నిర్వహించేవారని విద్యార్థులు తెలిపారు. అంతేకాదు, ట్రిపుల్ ఐటీ అధికారుల భార్యలు కూడా ఈ ప్రార్థనల వెనక ఉన్నట్టు తేలింది. విద్యార్థులను విచారించిన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. నేడో, రేపే దానిని వైస్ చాన్స్‌లర్‌కు అందించనుంది.
Andhra Pradesh
Nuziveedu
IIIT
Prayers
Enquiry
commity

More Telugu News