Chandrababu: ‘మన అమరావతి’ సెల్ఫీ పాయింట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • ప్రకాశం బ్యారేజ్ వద్ద ‘మన అమరావతి’ సెల్ఫీ పాయింట్
  • సెల్ఫీలకు చిరునామాగా ఈ పాయింట్ ఉంటుంది
  • అమరావతిని ఉత్తమ నగరంగా నిలుపుతాము
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ‘మన అమరావతి’ సెల్ఫీ పాయింట్ ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కృష్ణా ఘాట్ వద్ద ఈ సెల్ఫీ పాయింట్ ను ఏర్పాటు చేశారు. సెల్ఫీలకు చిరునామాగా ‘మన అమరావతి’ పాయింట్ ఉంటుందని అన్నారు. వచ్చే ఐదు, పదేళ్లలో అమరావతిని ఉత్తమ నగరంగా నిలుపుతామని చెప్పారు. ఈ సందర్భంగా అమరావతి బాండ్ల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ బాండ్లకు వచ్చిన స్పందన అద్భుతమని అన్నారు. తన పరిపాలనా పారదర్శకతకు నిదర్శనమే ఈ స్పందన అని, రైతులు కూడా తమ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టు భవనాల నిర్మాణానికి  టెండర్లు పిలిచామని, త్వరలోనే శాశ్వత అసెంబ్లీ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి అమరావతి రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు అన్నారు.
Chandrababu
amaravathi

More Telugu News