madhu sudhana chary: బైక్ ప్రమాదంలో తెలంగాణ స్పీకర్ కు స్వల్పగాయాలు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి బైక్ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో ‘పల్లెనిద్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈరోజు ఉదయం బైక్ పై ర్యాలీగా తిరుగు ప్రయాణమైన సందర్భంలో ఈ సంఘటన జరిగింది. ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పింది. దీంతో, మధుసూదనాచారి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆయన సెక్యూరిటీ సిబ్బంది మధుసూదనాచారిని పైకి లేపారు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతరం, మధుసూదనాచారి తన ర్యాలీని కొనసాగించడం కొసమెరుపు.
Go Back to Shorts
madhu sudhana chary

More Telugu News