రవితేజ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల!

  • రవితేజ, ఇలియానా జంటగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’
  • ప్రస్తుతం అమెరికాలో చివరి షెడ్యూల్
  • అక్టోబర్ 5న విడుదల
శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ, ఇలియానా జంటగా తెరకెక్కుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం నుండి తాజాగా కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ ని బట్టి చూస్తుంటే విభిన్నమైన లుక్ తో డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయడానికి సన్నద్దమవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది.
Go Back to Shorts
Raviteja
Tollywood
Hyderabad

More Telugu News