Telangana: ఖమ్మం జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం!

  • 5 సెకన్లపాటు కంపించిన భూమి
  • భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు
  •  బెంబేలెత్తిన ఐదు గ్రామాల ప్రజలు
ఖమ్మం జిల్లా వాసులను భూకంపం భయభ్రాంతులకు గురిచేసింది. 5 సెకన్లపాటు భూమి కంపించడంతో జనాలు ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులుతీశారు. భద్రాచలం, పాల్వంచ, బూర్గంపాడు, సుజాత నగర్, లక్ష్మీదేవిపల్లిలో భూమి స్వల్పంగా కంపించినట్టు స్థానికులు తెలిపారు. ఇళ్ల లోంచి బయటకు వచ్చి చాలాసేపు రోడ్లపైనే గడిపారు. భూకంపానికి సంబంధించి అధికారుల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే, స్థానికులు మాత్రం మంగళవారం రాత్రి  3 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించిందని చెబుతున్నారు.
Telangana
Khammam District
Bhadradri Kothagudem District
Earthquake

More Telugu News